తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. గ్రేటర్ ఎఫెక్ట్’యేనా ?

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 617 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు అంచనా వేశారు.

ఇప్పుడు వారి అంచనాలు నిజం అవుతున్నాయి. తెలంగాణలో స్వల్పంగా కరోనా కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. ఇక  నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,518కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 635 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,74,260కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,569 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 4,400 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.