అంతిమ్ : సల్మాన్ ఫస్ట్ లుక్ టీజర్


మహేష్‌ మంజ్రేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘అంతిమ్’. ఈ చిత్రంలో సల్మాన్‌ సిక్కు పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ముల్షీకి అనుసరణీయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆయుష్‌ శర్మ ఈ చిత్రానికి సంబంధించిన సల్మాన్‌ ఖాన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ది ఫైనల్ ట్రూత్ పేరిట ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు. చిన్న యాక్షన్ బిట్ సీన్ తో టీజర్ కట్ చేశారు. ఆయుష్‌ శర్మ-సల్మాన్ ఢీకొట్టున్న సీన్ అది. చాలా పవర్ ఫుల్ గా ఉంది. మాస్ మెచ్చెలా ఉంది. ప్రస్తుతం పూణెలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది.