రహానెకు సీక్రెట్‌ మెసేజ్‌.. ఢీకోడ్ చేస్తే దొరికిపోయాడు !

మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్ అజింక్య రహానెకు సీక్రెట్ మెసేజ్ పంపించాడు. ట్విటర్‌లో వ్యక్తిగత సందేశాలను పంపించడానికి వీళ్లేదు కదా అని ఆలోచిస్తున్నారా? అయితే రహానెను ట్యాగ్‌ చేస్తూ జాఫర్‌ అందరికి కనపడేలానే ట్వీట్‌ చేశాడు. అజింక్య రహానె.. ఇది రహస్య సందేశం. బాక్సింగ్ డే టెస్టుకు గుడ్‌ లక్‌!’ అని జాఫర్‌ పేర్కొంటూ దానికి 16 పదాలు జోడించాడు. ఈ మెసే జ్‌ను డీకోడ్ చేస్తే అసలు రహస్యం బయటపడింది.

ఆ 16 పదాల్లోని తొలి అక్షరాన్ని విడిగా రాస్తే.. ‘పిక్‌ గిల్‌ అండ్‌ రాహుల్‌’ అని వస్తుంది. డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్‌ డే టెస్టుకు శుభ్‌మన్‌ గిల్, కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని రహానెకు ఇలా పరోక్షంగా జాఫర్‌ సూచించాడు. పితృత్వ సెలవులపై కోహ్లీ భారత్‌కు తిరిగిరానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి మూడు టెస్టులకు రహానె కెప్టెన్సీ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.