నయన్-విఘ్నేష్’లని విడదీసిన రజనీ !
స్టార్ హీరోయిన్ నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోయింది అనే ప్రచారం జరుగుతున్నప్పుడల్లా.. అందులో నిజం లేదంటూ కలిసి దిగిన, తిరిగిన ఫోటోలని షేర్ చేస్తూ షాకిస్తుంటారు. అయితే ఇటీవల ఈ జంట నిజంగా విడి విడిగా ఉంటున్నారట. వీరిని విడదీసింది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెబుతున్నారు.
ఈ జంటని విడదీయాల్సిన అవసరం రజనీకి ఏంటీ ? అనుకుంటున్నారు. నయన్, విగ్నేష్ ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. కానీ కలుసుకోవడం లేదు. దానికి కారణం రజనీనే. రజనీకాంత్‌తో కలిసి నయన్ నటిస్తున్న `అన్నాత్తే` సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అలాగే నయన్ ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ రూపొందిస్తున్న `కాదు వాకుల రెండు కదల్` సినిమా కూడా హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే `అన్నాత్తే` సినిమా షూటింగ్ స్పాట్‌లోకి బయటివారెవరినీ అనుమతించడం లేదట. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బయటివారిని కలవడకూడదని నిబంధన విధించారట. కరోనా నేపథ్యంలోనే ఈ రూల్ పెట్టారట. దీంతో ఒకే చోట ఉంటున్నా నయన్, విఘ్నేష్ విడివిడిగా ఉంటున్నారని.. వారిని విడదీసింది రజనీ అని చెప్పుకొంటున్నారు.