భర్తని తన దారిలోకి తెచ్చుకున్న నిహారిక

మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకొని ఇంకా నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే భర్తని దారిలోకి తెచ్చుకుంది. అలాగని నిహారిక సూర్యకాంతంలా మారలేదు. భర్తని హద్దు-అదుపుల్లో పెట్టుకోవడం లేదు. ఇక్కడ దారిలోకి తెచ్చుకోవడం అంటే.. సినీ ఇండస్ట్రీ వైపుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది. పెళ్లికి ముందు నిహారిక నటిగా రాణించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే పెళ్లి తర్వాత కూడా నిహారిక కెరీర్ ని కొనసాగించనుంది.

అలాగని నటిగా కాదు. నిర్మాతగా మారనుందట. అదీ కూడా భర్తతో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయనున్నారట. సంక్రాంతి తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఆహా ఓటీటీకి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే కొంత మంది కొత్త దర్శకులు చెప్పిన లైన్‌కు వీళ్లిద్దరు త్వరలోనే ఓకే చేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. చైతన్య.. నిహారికతో కలిసి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.