తెరాస ఎమ్మెల్సీలకు నోటీసులు
గోరేటి వెంకన్న, సారయ్య, దయానంద్’లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి నియమాలకాలని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు. గోపాల్ అనే వ్యక్తి… తన పేరును రెండుసార్లు గవర్నర్ ప్రతిపాదించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులను ఆమోదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, సారయ్య, దయానందకు నోటీసులు జారీ చేసింది. మరీ కేసులో ఫైనల్ గా కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అన్నది చూడాలి.