బన్నీ న్యూఇయర్ గిఫ్ట్ రెడీ

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ అయింది. ఆహా కోసం.. స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సామ్ జామ్’ షోలో బన్నీ పాల్గొన్నారు. ఈ ఏపీసోడ్ ని న్యూఇయర్ కానుకగా జనవరి 1న టెలికాస్ట్ చేయనున్నారు. స్టార్స్ నుంచి సామ్ ఇంట్రెస్ట్రింగ్ విషయాలు రాబడుతోంది. ఈ నేపథ్యంలో సామ్ బయటపెట్టనున్న బన్నీ సీక్రెట్ ఏంటీ ? అన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే సామ్ జామ్ లో విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్,  రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సామ్ జామ్ లో పాల్గొన్నారు. ఆ ఏపీసోడ్ క్రిస్మస్ కానుకగా రేపు ప్రసారం కానుంది. ఆ తర్వాత వారం బన్నీ బరిలోకి దిగనున్నారు. మొత్తానికి… ఆహా కోసం మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలు కొని.. ఒకొక్కరుగా బరిలోకి దిగుతున్నారు. అతి త్వరలోనే రామ్ చరణ్ కూడా సామ్ జామ్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.