బిగ్ బాస్ విన్నర్.. పది రోజుల పండగ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఇంకా విన్ కిక్కులోనే ఉన్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నారు. వారికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఝతలు చెప్పుకుంటున్నాడు అభిజిత్. వరుసగా టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ వెబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సక్సెస్ టూర్ కి ప్లాన్ చేస్తున్నాని తెలిపారు.

‘ఓ 10 రోజులు పండగ చేద్దాం అనుకుంటున్నాను. అందర్నీ కలవాలనుకుంటున్నాను. సక్సెస్ మీట్ మాత్రమే కాదు. రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో చాలా టౌన్స్ తిరగాలనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కర్ని కలుస్తాను. దానికి ప్లాన్ రెడీ చేస్తున్నాం’ అని తెలిపారు. అదెలా ఉండబోతుంది ? ఎప్పుడు ? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.