చింతమనేని విచిత్ర ఆహ్వానం
కరోనా కాలంలో వివాహ వేడుకలు చాలా సింపుల్ గా జరిగిపోయిన్నాయి. సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లిళ్లు అయినా కుటుంబ వేడుకగా జరుపుకుంటున్నారు. కరోనా లాక్డౌన్ టైమ్ లో నితిన్, రానా, నిఖిల్, నిహారిక పెళ్లిళ్లు జరిగాయి. కేవలం కుటుంబ వేడుకగా జరుపుకున్నారు. చాలా దగ్గరిని వారిని మాత్రమే ఆహ్వానించారు. అయితే తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరు మాత్రం భిన్నంగా ఉంది.
తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది అథితుల సమక్షంలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పెళ్లి కార్డులు మాత్రం అందరికి ఆహ్వానిస్తున్నారు. అలాగని అందరిని ఆహ్వానిస్తున్నారు. ఘనంగా పెళ్లి చేయబోతున్నారు అనుకొనేరూ. ఈ వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డును, స్వీట్ బాక్స్ ను అందరికి పంచిపెడుతున్నాడు. అయితే, బాక్స్ పై ఓ మెసేజ్ ను ముద్రించారు. కరోనా నిబంధనలు కారణంగా నూతన వధూవరులను తమ ఇళ్ల నుంచే ఆశీర్వదించాలని కోరారు. జనవరి 2న ఈ వివాహ వేడుక జరగనుంది.