హైదరాబాద్ నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ స్ట్రైయిన్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఇటీవల బ్రిటిన్ నుంచి పలువురు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. వారందరికీ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. కొత్త రకం వైరస్‌ గుర్తించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌లో జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్రం ఏర్పాటుకు రూ.40కోట్ల వ్యయం కానుంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీసీఎంబీలో జన్యుపరిశోధనలు సాగుతున్నాయి. గత నెల రోజుల్లో బ్రిటన్‌ నుంచి తెలంగాణకు సుమారు మూడు వేల మంది వరకు వచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 800 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీకి ముందుగా వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా తేలిన ఇద్దరి నమూనాలను అధికారులు సీసీఎంబీకి పంపారు. వారికి సోకింది పాత కరోనా వైరస్ నా ? లేక కొత్త రకం కరోనా వైరస్ నా ?? గుర్తించే పనిలో ఉన్నారు.