పీసీసీ పోస్ట్.. జగ్గారెడ్డి అవుట్ !
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ.. ప్రక్రియ క్లైమాక్స్ కి చేరుకుంది. ఫైనల్ గా ముగ్గురు పేర్లని (రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క్) పేర్లని అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. వీరిలో ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నారు.
అయితే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన చెందారు. సోనియాగాంధీకి పంపించిన లిస్ట్‌లో తన పేరు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 2017లో కోట్లు ఖర్చు పెట్టి సంగారెడ్డిలో రాహుల్‌గాంధీతో భారీ బహిరంగ సభ పెట్టినట్లు గుర్తుచేశారు. ఇంత చేసినా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చర్చలో తన పేరు లేకపోవడం చాలా బాధ అనిపించిందన్నారు. ఇక ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఖరారైంది. ఆ పదవిని ఆశిస్తున్న ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డికి మరో కీలక పదవి ఇవ్వనున్నారని సమాచారమ్.