మాస్టర్’కు ‘యు/ఎ’
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే వచ్చే యేడాది మే నెలలో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే సంక్రాంతికి విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అందుకు చిత్రబృందం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా మాస్టర్ సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు లోకష్ కనగరాజు ట్విట్ చేశారు. అయితే రిలీజ్ డేటు మాత్రం ఖరారు చేయలేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ సంక్రాంతి రిలీజ్ పై త్వరపడి ప్రకటన చేయలేదు. ఇంకొన్నాళ్లు వేచిచూసి.. పరిస్థితులని గమనించి రిలీజ్ డేటుని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.