‘రెడ్’ ట్రైలర్ టాక్

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. ఈ యేడాది ఏప్రిల్ లోనే రెడ్ రిలీజ్ కావాల్సివుంది. కానీ కరోనా విజృంభణతో వాయిదా పడింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినా వాటిపై చిత్ర బృందం స్పందించలేదు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. రామ్ లో జనాలకు నచ్చిన ఆ రఫ్ మాస్ యాంగిల్ ను బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసారు. అదే టైమ్ లో కథలో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ను ట్రయిలర్ లో ప్రెజెంట్ చేసి, ఆసక్తి రేకెత్తించే ప్రయత్నమూ చేసారు. రామ్ డబుల్ రోల్..ఒకటే లుక్ జస్ట్ డ్రెస్ ఛేంజ్ అన్నవి కాస్త ఆసక్తి కలిగించేలా వున్నాయి. రెడ్ ట్రైలర్ పై మీరు ఓసారి లుక్కేయండీ.. !