సీనియర్ నటి డేటింగ్ స్టోరీ విన్నారా ?
టాలీవుడ్ లో ఇటీవల లేటు వయసు పెళ్లిళ్లు జరుగుతుండడం చూస్తున్నాం. నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. సింగర్ సునీత రెండో పెళ్లికి రెడీ అయ్యారు. రామ్ వీరపనేనిని పెళ్లాడబోతున్నారు. ఇటీవలే నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్.డిసెంబర్ 27న వీరి వివాహం డెస్టినేషన్ వేడుకగా జరగనుందని పలు వార్తలు వినిపింస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి డేటింగ్ మేటర్ ఒకటి బయటికి పొక్కింది.
ఓ సీనియర్ నటి ఒకరు.. ఓ వ్యాపారితో సన్నిహిత స్నేహ బంధం నెరపుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.యాభైలు దాటేసిన ఆ సీనియర్ నటి ప్రస్తుతం పెద్దగా నటించడం లేదు. ఒంటరిగా వుంటున్న ఆమె ఓ నార్త్ ఇండియన్ వ్యాపారితో సన్నిహితంగా వుంటున్నట్లు తెలుస్తోంది. ఒక దశలో పెళ్లి ఆలోచన కూడా చేసారని, అయితే ఈ వయసులో అలాంటి నిర్ణయం తీసుకోవడం అంత బాగుండదనే ఉద్దశంతో ఆ బంధం అలా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.