రివ్యూ : సోలో బ్రతుకే సో బెటర్
చిత్రం : సోలో బ్రతుకే సో బెటర్ (2020)
నటీనటులు : సాయితేజ్, నభా నటేశ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, రావూ రమేష్,నరేష్ తదితరులు
సంగీతం : తమన్ ఎస్
దర్శకత్వం : సుబ్బు
నిర్మాత : బీవియస్‌ఎన్ ప్రసాద్
రిలీజ్ డేటు : డిసెంబర్ 25, 2020.
307 రోజుల తర్వాత తిరిగి థియేటర్స్ సందడి మొదలైంది. కరోనా లాక్‌డౌన్ తో మార్చిలో థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరచుకున్నాయి. థియేటర్స్ తెరచుకున్న తర్వాత రిలీజైన తొలి తెలుగు సినిమా సోలో బ్రతుకే సో బెటర్. సాయిధరమ్ తేజ్-నభా నటాషా జంటగా నటించారు. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ బట్టే.. మిగిలిన సినిమాలు థియేటర్స్ కి రావాలా ? ఓటీటీ బాట పట్టాలా ?? అనేది నిర్ణయించుకోనున్నాయ్. ఈ నేపథ్యంలో సోలో బ్రతుకే బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది. మరీ.. ఈ సినిమా ఎలా ఉంది ? తెలుసుకొనేందుకు రివ్యూలో వెళదాం పదండీ.. !
కథ :
విరాట్ (సాయిధరమ్ తేజ్) సోలో బ్రతుకే సో బెటర్ అని చెబుతూ తోటి స్నేహితులతో కలిసి కాలేజీలో సోలో క్లబ్ ని నడుపుతుంటాడు. యువతకు గీతోపదేశాలు ఇస్తాడు. అబ్దుల్ కలాం, ఆర్ నారాయణ మూర్తి, అటల్ బిహారి వాజ్‌పేయి ఆదర్శంగా తీసుకొని స్వేచ్ఛగా బతికేద్దామని యువతకు పిలుపునిస్తాడు. పెళ్లి చేసుకునే పడే కష్టాలు ఏంటో, సోలోగా ఉంటే జరిగే లాభాలేంటో తెలియజేయడానికి 108 శ్లోకాలతో కూడిన బుక్‌ను రాసి ప్రచారం చేస్తాడు. అలాంటి విరాట్.. ఓ దశలో సోలో బ్రతుకుకి పులిస్టాప్ పెట్టాలనుకుంటాడు. జోడి కోసం వెతుకుతున్న అతడి జీవితంలోకి అమృత (నభా నటాషా) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? సోలో జీవితం గురించి అంతలా చెప్పిన విరాట్ ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ? అన్నది మిగితా కథ.
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. పెళ్లి కానీవారు, పెళ్లైన వారు కనెక్ట్ అయ్యే కథ. దాన్ని దర్శకుడు బాగానే డీల్ చేశాడు. సోలో బ్రతుకు గొప్పదనం హీరో చెప్పే విషయాలు, ఆయన చేసే సందడి ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. దీంతో ప్రథమార్థం సరదా సరదాగా సాగింది. అయితే హీరో సోలో బ్రతుకు పులిస్టాప్ పెట్టాడానికి కారణాలని, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఎమోషన్స్ సీన్స్ ఇంకాస్త బలంగా చూపిస్తే బాగుండేది.
ఇక విరాట్ పాత్రలో సాయితేజ్ ఒదిగిపోయాడు. సోలో ప్రతినిధిగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ, ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నభా నటాషా రాకతో సినిమా కీలక మలుపు తీసుకుంటుంది. అందంగా కనిపిస్తుంది.సోలో జీవితాన్ని స్పూర్తిగా తీసుకున్న అమ్మాయి పాత్రలో సండి చేసింది. రావు రమేష్ పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ అవుతోంది. నవ్వించే బాధ్యతని వెన్నెల కిషోర్ తీసుకున్నారు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకాంఢాఫ్ నెమ్మదిస్తుంది. సెకాంఢాఫ్ లో కొన్ని సీన్స్ ని కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి
ప్లస్ పాయింట్స్ :
* ఫస్టాఫ్
* సాయిధరమ్ తేజ్ నటన
* సంగీతం
* రావు రమేష్ పాత్ర
మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్
* ఎమోషన్స్
* లవ్ ట్రాక్
బాటమ్ లైన్ : సోలో బ్రతుకు సగం బెటర్
రేటింగ్ : 3/5
నోట్ : ఈ విశ్లేషణ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!