నిరుద్యోగులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణలో తెరాస పాలన బాగుంది. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో రైతులు, వృద్దులు హ్యాపీగా ఉన్నారు. కానీ నిరుద్యోగులు, ఉద్యోగులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దాని ఫలితమే దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ఎదురుదెబ్బలు తగిలాయి. దానిని గుర్తించిన సీఎం కేసీఆర్..వ్యతిరేకత పెంచుకున్న నిరుద్యోగులు, ఉద్యోగులను మంచి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. కేసీఆర్ ఒకే సారి యాభై వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి ప్రక్రియ సాగుతోంది.
ఇక ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మరో వర్గం ఉద్యోగులు. ఉద్యోగులు తనపై ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. కేసీఆర్కు తెలుసు. ఇప్పుడు వారిని మంచిక చేసుకొనే పనిలో ఉన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా.. రివిజన్ కమిటీ సిఫార్సులు, పీఆర్సీని ఆమోదించేందుకు రెడీ అవుతున్నారు. వారిని ఖుషీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తానికి.. కొద్దికాలం గ్యాప్ లో ఇటు నిరుద్యోగులు, అటు ఉద్యోగులకి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు.