మారుతి.. పక్కా కమర్షియల్ !
గత యేడాది ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో హిట్ కొట్టాడు దర్శకుడు మారుతి. ఆ తర్వాత ఆయన మరో సినిమాని మొదలెట్టలేదు. యూవీ, గీతాఆర్ట్స్ లో మారుతి సినిమా ఫిక్సయింది. రవితేజ కథానాయకుడిగా సినిమా దాదాపు ఓకే అయింది. కానీ రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ తగ్గలేదు. ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడీ.. ఈ కథని గోపీచంద్ తో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు.
ఇందులో హీరో లాయర్ గా కనిపిస్తారట. డబ్బుల కోసం ఏ కేసునైనా వాదించే లాయర్ గా కనిపిస్తారట. అందుకే పక్కా కమర్షియల్ టైటిల్ బాగా సూటవుతుందని మారుతి భావిస్తున్నారట. దానినే ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. ఓ కాన్సెప్ట్ తో కథ రాసుకోవడం.. హిట్ కొట్టడం మారుతికి అలవాటైపోయింది. మతిమరుపు కాన్సెప్ట్ తో మారుతి తీసిన ‘భలే భలే మగాడివోయ్’ హిట్ అయింది. అతి శుభ్రత కాన్సెప్ట్ తో తీసిన ‘మహానుభావుడు’ హిట్ కొట్టాడు. ఇప్పుడు డబ్బు కాన్సెప్ట్ ని మారుతి ఎంచుకున్నట్టు తెలుస్తోంది.