మెగాస్టార్ సూపర్ హిట్స్ రిమేక్.. ఏ సినిమాకి ఏ హీరో ?


మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్ బస్టర్ చిత్రాలని పంచేశారు. ఈ తరం హీరోల్లో ఏ సినిమా ఏ హీరోకు సరిపోతుందనే విషయం చెప్పేశారు. సమంత హోస్ట్’గా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ ఛాట్‌ షో ‘సామ్‌జామ్‌ తాజాగా మెగాస్టార్ పాల్గొన్నారు. ఎన్నో ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. సినిమా, పర్సనల్ విషయాలని చెప్పారు. సమంత.. చిరుని మీ సూపర్ హిట్ చిత్రాలని రీమేక్ చేస్తే వాటికి ఏఏ హీరోలు సెట్ అవుతారని అడిగింది. దీనికి చిరంజీవి ఆసక్తికర సమాధానాలు చెప్పారు

* జగదేకవీరుడు.. అతిలోక సుందరి – రామ్ చరణ్ లేదా మహేష్ బాబు, అతిలోక సుందరిగా మాత్రం సమంత

*  ఠాగూర్ –  పవన్ కల్యాణ్‌

* ఇంద్ర – ప్రభాస్

* ఛాలెంజ్ – బన్నీ లేదా విజయ్ దేవరకొండ

*  గ్యాంగ్ లీడర్ – రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్

* రౌడీ అల్లుడు – రవితేజ లేదా బన్నీ

* విజేత – నాగ చైతన్య

ఇక స్వయంకృషి మాత్రం ఎవరికి సూట్ కాదు. అది తనకు మాత్రమే సొంతం అన్నారు. అయితే మెగాస్టార్ తన సూపర్ హిట్ చిత్రాల పంపికాల్లో నిజాయితీ ఉందని షో చూసిన అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లూసిఫర్ రిమేక్ లో నటించనున్నారు.

https://www.aha.video/originals/ndrm/sam-jam