ఫ్రాన్స్ కి పాకిన కొత్తరకం కరోనా వైరస్
బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ ప్రపంచ దేశాలు పాకుతోంది. ఇప్పటికే ఇటలీలోనూ ఓ వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించారు. డెన్మార్క్లోనూ ఏడుగురికి కొత్త రకం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. అలాగే నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలోనూ ఒక్కో కేసు నమోదైంది. తాజాగా ఈ వైరస్ ఫ్రాన్స్ కి పాకింది.
శుక్రవారం అక్కడ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. బాధితుడు డిసెంబరు 19న బ్రిటన్ నుంచి తిరిగొచ్చినట్లు తెలిపారు. డిసెంబరు 21న పరీక్షలు జరపగా.. పాజిటివ్ అని తేలడంతో నిర్బంధంలో ఉంచారు. తదుపరి పరీక్షలు చేయగా.. అది కొత్త రకం వైరస్ అని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.