సోలో బ్రతుకు.. భారీ ఓపెనింగ్స్ !
మెగా యంగ్ హీరో సాయిధరమ్ హిట్ అయ్యాడు. ఇండస్ట్రీని హిట్ చేశాడు. కరోనా లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన తొలి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొంది. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ ఉంది. సెకాంఢాఫ్ యావరేజ్ అని రివ్యూలు చెప్పాయ్.
అయితే సినిమా టాక్, కరోనా భయాలని ఏమీ పట్టించుకోకుండా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లారు. ఫలితంగా సోలో బ్రతుకుకి తొలిరోజు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. రూ. 4.70 కోట్లు (గ్రాస్) సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 50శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడిచాయి. అయినా.. ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఈ లెక్కన తేజు హిట్ అయ్యాడు. దీంతో పాటు ఇండస్ట్రీని హిట్ చేశాడు. ఇకపై సినిమాలన్నీ మళ్లీ థియేటర్స్ లోకి క్యూ కట్టడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ తెరకెక్కింది. తేజుకి జంటగా నభానటాషా నటించింది. రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రలో నటించారు. సోలో బ్రతుకు గొప్పదనం అనే పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు దానిని సరదాగా తీసే ప్రయత్నం చేసారు. అందులో కొంత మేరకు సక్సెస్ అయ్యారు. అయితే ఎమోషన్స్ కూడా ఇంకాస్త బలంగా పండితే.. సినిమా రేంజ్ మరోలా ఉండేదని చెబుతున్నారు. మొత్తానికి ఎంటర్ టైన్ మెంట్ కరువైన ఈ టైమ్ లో సోలో బ్రతుకు.. ప్రేక్షకులని రిలాక్స్ చేస్తుంది.