నాలుగేళ్ల చిన్నారికి కొత్తరకం కరోనా వైరస్ ?
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇటీవల యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వారికి సోకింది కొత్తరకం కరోనా వైరస్ నా ? పాత రకం కరోనా వైరస్ నా ? అన్నది తేలాసి ఉంది.
తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన నాలుగేళ్ల చిన్నారికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే వారి తల్లిదండ్రులిద్దరికీ నెగెటివ్ రావడం గమనార్హం. దీంతో వీరందరినీ ప్రస్తుతం సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. అయితే చిన్నారికి సోకిన వైరస్ కొత్త రకమా? కాదా? అన్నది ఇంకా తెలియరాలేదు. ఆమె రక్తనమూనాలను వైరాలజీ ల్యాబ్‌ను పంపించారు.