పిక్ ఆఫ్ ది డే : రౌడీతో.. అభిజిత్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ – ఈ సినిమాలో నటించిన నటీనటుల జీవితాలు నిజంగానే బ్యూటీఫుల్ గా మారుతున్నాయ్. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు స్టార్ హీరో. అంతకుమించి. ఇక ఈ సినిమాతో తెరకు పరిచయమైన అభిజిత్ బిగ్ బాస్ 4 విన్నర్ గా నిలిచారు. అయితే విజయ్ దేవరకొండతో అభిజిత్ కు స్నేహం ఉంది. ఇప్పటికీ మాట్లాడుకుంటామని అభిజిత్ తెలిపారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న అభిజిత్ కు విజయ్ పరోక్షంగా సపోర్ట్ చేశాడు. మనోళ్లు ఎక్కడ ఉన్నా.. బాగుండాలని ట్విట్ చేశారు.

బిగ్ బాస్ విన్నర్ గా  నిలిచిన అభిజిత్ కు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలావుండగా తాజాగా అభిజిత్ తన స్నేహితుడు విజయ్ దేవరకొండని కలిశారు. దానికి సంబంధించిన ఫోటోని అభిజిత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. #FullChill అని కామెంట్ పెట్టాడు. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.