జీతాలు ఇవ్వట్లేదని ప్రగతి భవన్ ముట్టడి
తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాస షాక్ తగలడం వెనక వారి అసంతృప్తినే కారణం. ఇది గమనించిన సీఎం కేసీఆర్.. త్వరలోనే ఉద్యోగులు, నిరుద్యోగులని ఖుషి చేయబోతున్నారని చెబుతున్నారు.
ఇదిలావుంచితే.. తాజాగా సాంకేతిక కళాశాలల ఉద్యోగులు ఇవాళ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. కరోనా నెపంతో ప్రైవేటు కళాశాలల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషనుకు తరలించారు.