బాక్సింగ్ డే టెస్ట్ : 60 పరుగుల ఆధిక్యంలో భారత్
ఆసీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం పెంచుకుంటోంది. తొలి ఇన్నింగ్ లో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కెప్టెన్ రహానె (89), జడేజా (35) ఉన్నారు.
తొలి సెషన్‌లో 90/3తో నిలిచిన టీమ్‌ఇండియా రెండో సెషన్‌లో మరో 99 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత హనుమ విహారి(21; 66 బంతుల్లో 2×4) నాథన్ లైయన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా రెండో సెషన్ పూర్తయ్యే ముందు రిషభ్ పంత్(29; 40 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ పైన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 173 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ని 195 పరుగులకి అలౌట్ చేసిన సంగతి తెలిసిందే.