బాక్సింగ్ డే టెస్ట్ : రహానె 104 (నాటౌట్)

బాక్సింగ్ డే టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కెప్టెన్ రెహానె (100, 199 బంతుల్లో, 10ఫోర్లు) సెంచరీ పూర్తి చేశాడు. అతడికి తోడుగా జడేజా 36 పరుగులతో ఆడుతున్నాడు. ప్రసుత్తం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బౌలర్లని బాగా ఉపయోగించుకున్న రహానె తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 195 పరుగులకే కట్టడి చేయగలిగాడు. ఇక బ్యాటింగ్ లో బాధ్యత తీసుకొని.. ఆసీస్ బౌలర్లకి కొరకరాని కొయ్యగా మారాడు.

తొలి సెషన్‌లో 90/3తో నిలిచిన టీమ్‌ఇండియా రెండో సెషన్‌లో మరో 99 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత హనుమ విహారి(21; 66 బంతుల్లో 2×4) నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరగా రెండో సెషన్‌ పూర్తయ్యే ముందు రిషభ్‌ పంత్‌(29; 40 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో కీపర్‌ పైన్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 173 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది.  ఆ తర్వాత రహానె, జడేజా ఆసీస్ బౌలర్లకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ జోడి ఇలాగే నిలబడితే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు భారీ ఆధిక్యం ఖాయం.