2021లో వీటి ధరలు పెరగబోతున్నాయ్ !

2020 యేడాదికి గుడ్ బై చెప్పే సమయం దగ్గరపడనుంది. మరో మూడ్రోజుల్లో క్యాలెండర్ మారనుంది. 2021లో అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో 2021లో వీటి ధరలు పెరగబోతున్నాయంటూ ఓ అలర్ట్ వచ్చేసింది. 2021 జనవరి నుంచి ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజెరేటర్లు, వాషింగ్‌ మిషిన్‌లు వంటి సామగ్రి ధరలు జనవరి నుంచి దాదాపు 10శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వీటిల్లోని ముడిపదార్థాలైన కాపర్‌, అల్యూమినియం, స్టీల్‌, ప్లాస్టిక్‌ ధరల ప్రభావం వీటిపై పడనుంది.

వీటితో పాటు నౌకారవాణా, విమానాల్లో కార్గో ధరల్లో పెరుగుదల ప్రభావం కూడా వీటిపై పడనుంది. ఇవే కాకుండా సరఫరా తగ్గడంతో టీవీ ప్యానల్‌ (ఓపెన్‌ సెల్‌) ధరలు రెండింతలయ్యాయి. దీంతో ఎల్‌జీ, పానాసానిక్‌, థాంమ్సన్‌ జనవరి నుంచి ధరలు పెంచనున్నాయి. సోనీ పరిస్థితిని సమీక్షిస్తోంది.. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.