వైరల్ : ‘ఏపీ నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్’ అంటూ పోస్టర్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రాజకీయాలతో టచ్ ఉంది. ఆయన గతంలో తెదేపా తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన ప్రసంగాలతో ప్రజలకి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తెదేపా తారక్ ని పక్కకు పెట్టింది. లోకేష్ కోసమే తారక్ ని తొక్కేశారు అనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెదేపాకు పూర్వవైభవం రావాలంటే అది జూనియర్ ఎన్ టీఆర్ తోనే సాధ్యమనే అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయాన్ని తాజాగా పోస్టర్ల రూపంలో చూపించినట్టున్నారు.

‘ఏపీ నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఓ ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పుడీ ఫ్లెక్సీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు, తెదేపా శ్రేణులే ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఉన్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు వయసైపోతుంది. ఆయన తనయుడు లోకేష్ పై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో తెదేపాని లీడ్ చేసే కెపాసిటీ తారక్ కి మాత్రమే ఉందనే అభిప్రాయపడుతున్నారు. మరీ.. నిజంగా తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ? సీఎం అవుతారా ?? కాలమే సమాధానం చెప్పాలి.