బాక్సింగ్ డే టెస్ట్ : పట్టుబిగిస్తున్న భారత్

బాక్సింగ్ డే టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగుల ఆధిక్యం సాధించింది. సోమవారం ఉదయం 277/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లో మరో 49 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. తొలుత జట్టు స్కోర్‌ 294 పరుగుల వద్ద రహానె (112; 223 బంతుల్లో 12×4) రనౌట్‌ కాగా, మరో ఆరు ఓవర్లకే జడేజా (57; 159 బంతుల్లో 3×4) సైతం పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత అశ్విన్‌(14), ఉమేశ్‌ (9) కాసేపు క్రీజులో నిలిచారు.భారత ఇన్నింగ్స్‌కు 326 పరుగుల వద్ద తెరపడింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కు ఆదిలోని షాక్ తగిలింది.  ఓపెనర్ బర్న్స్ 4 పరుగులకే అవుటయ్యాడు. డేంజర్ గా మారుతున్న లబుషే (2)8 ను అశ్విన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 2 వికెట్లు నష్టపోయి 53 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది.