కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్ !

కరోనా లాక్‌డౌన్ కాలంలో కండోమ్ ల అమ్మకాలు భారీగా పెరిగాయని ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ రాత్రి పూట కంటే పగలే ఎక్కువగా వీటి ఆర్డర్లు వచ్చినట్లు ఈ అధ్యయనం చేసిన సర్వీస్ యాప్ డుంజో తెలిపింది. 2020లో భారత వినియోగదారుల కొనుగోలు తీరు ఎలా మారిపోయిందో ఈ అధ్యయనం వివరించింది.

దేశంలోనే మన హైదరాబాద్ లో కండోమ్స్ ఆర్డర్లు ఆరు రెట్లు ఎక్కువగా జరిగాయట. చెన్నైలో 5 రెట్లు, జైపూర్‌లో 4 రెట్లు, ముంబై, బెంగళూరుల్లో రెండు రెట్లు కండోమ్స్ కోసం ఆర్డర్లు చేసినట్లు డుంజో చెబుతోంది. కండోమ్సే మాత్రమే కాదు గర్భాన్ని నివారించే కాంట్రసెప్టివ్ ఐపిల్స్, ప్రెగ్నెన్సీ కిట్స్‌కూ అదే స్థాయిలో డిమాండ్ ఉండటం విశేషం. ఇక కరోనా లాక్‌డౌన్ కాలంలో  హైదరాబాదీలు తమ ఆహార అలవాట్లను కూడా మార్చుకున్నట్లు ఈ సర్వేలో తేలింది. చెక్కర కంటే ఎక్కువగా బెల్లం వినియోగించారట.