ట్రంప్ కరోనా ప్యాకేజ్.. స్టార్ మార్కెట్లకు రెక్కలు !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 900 బిలియన్‌ డాలర్ల కరోనా ప్యాకేజీపై సంతకం చేయడం మార్కెట్లో జోష్‌ నింపింది. ఈ ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఉదయం 9.23 సమయంలో నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 13,843 వద్ద, సెన్సెక్స్‌ 308 పాయింట్లు పెరిగి 47,281 వద్ద ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ ఉదయం ఒక దశలో 100పాయింట్లకు పైగా లాభపడింది. ఫలితంగా సూచీలు సరికొత్త శిఖరాలకు చేరాయి. పైసాలో డిజిటల్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, సీఈఎస్‌ఈ వెంచెర్స్‌, జేపీ అసోసియోట్స్‌ షేర్లు భారీగా లాభపడగా.. డిష్‌టీవీ, బయోకాన్‌, ఒమాక్స్‌, ఇండియా టూరిజం, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.