స్టార్స్ న్యూఇయర్ గిఫ్ట్స్ రెడీ

మరో రెండ్రోజుల్లో న్యూ ఇయర్. అభిమానులు కలర్ ఫుల్ గా కొత్త యేడాదిలోకి అడుగుపెట్టేందుకు స్టార్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. బహుమతులు రెడీ చేస్తున్నారు. న్యూఇయర్ కానుకగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి బహుమతులు క్యూ కట్టనున్నాయి. ‘వకీల్ సాబ్’ టీజర్ రాబోతుంది. దీంతో పాటు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన పలు సినిమాల నుంచి అప్ డేట్స్ రానున్నాయి.

ఇక పవన్ తర్వాత ప్రభాస్ నుంచి ఎక్కువ బహుమతులు అందనున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ తో బిజీగా ఉన్నారు. న్యూఇయర్ కానుకగా రాధేశ్యామ్ నుంచి టీజర్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్, సలార్ అప్ డేట్స్ రానున్నాయ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ రాబోతుంది. ఈ సారి అలియా లుక్ ని రివీల్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ నుంచి అప్ డేటు రానుంది. ఓ ఊరమాస్ బిట్ సీన్ వదులుతారని టాక్. ఇలా.. స్టార్స్  నుంచి బహుమతులు క్యూ కట్టనున్నాయ్. దీంతో న్యూఇయర్ కలర్ ఫుల్లుగా మారనుంది.