రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్.. వణికిపోతున్న మిగితా హీరోలు !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా చరణ్ తెలిపారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు ఎలాంటి లక్షణాల్లేవు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాను. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకం ఉంది. దీన్నుంచి బయటపడతాను’ అని చరణ్ ట్విట్ చేశారు.
చరణ్ కి కరోనా సోకిందనే న్యూస్ మిగితా హీరోలకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే ? ఇటీవల రామ్ చరణ్ ని చాలా మంది హీరోలు కలిసిశారు. నిహారిక పెళ్లి, ఆ తర్వాత కూడా మెగా హీరోలందరూ కలుసుకున్నారు. ఈ లెక్కన మెగా హీరోలందరిలోనూ కరోనా కలవరం మొదలైంది. ఇక ఇటీవల రామ్ చరణ్ ఆచార్య సెట్ కి వెళ్లారు. అక్కడ దర్శకుడు కొరటాల శివ, ఇతరులతో సరదగా మాట్లాడారు.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తారక్, ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం మరోసారి కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి. అంతేకాదు.. చరణ్ కు కరోనా పాజిటివ్ గా రావడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదా పడే అవకాశాలున్నాయి.
Request all that have been around me in the past couple of days to get tested.
More updates on my recovery soon. pic.twitter.com/lkZ86Z8lTF— Ram Charan (@AlwaysRamCharan) December 29, 2020