మూడో టెస్ట్.. ఆసీస్ జట్టులో భారీ మార్పులు !

భారత్-ఆసీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తంగా సాగుతోంది. మొదటి టెస్టులో టీమిండియా చారిత్రాత్మక ఓటిమి పాలైంది. సెకండ్ ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలింది. అయితే దాన్నుంచి చాలా త్వరగానే కోలుకొని రెండో టెస్టులో గెలుపొందింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుని రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో  ఆస్ట్రేలియా తమ లోపాల్ని సరిదిద్దుకునే పనుల్ని వేగవంతం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన ఓపెనర్‌ జో బర్న్స్‌ను జట్టు నుంచి తొలగించింది. బర్న్స్‌ అడిలైడ్‌ టెస్టులో 8, 51 పరుగులు; బాక్సింగ్ డే టెస్టులో 0, 4 పరుగులు చేశాడు. అయితే గాయాలతో జట్టుకు దూరమైన డేవిడ్ వార్నర్‌, విల్‌ పకోస్కీ, సీన్ అబాట్‌ను తిరిగి చివరి రెండు టెస్టులకు ఎంపికచేసింది. 

ఆసీస్‌ జట్టు : డేవిడ్ వార్నర్‌, విల్‌ పకోస్కీ, మార్కస్ హారిస్‌, మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్, లబుషేన్, ట్రేవిస్‌ హెడ్, హెన్రిక్స్‌, టిమ్‌ పైన్ (కెప్టెన్‌), కమిన్స్‌, గ్రీన్‌, సీన్ అబాట్‌, లైయన్‌, స్టార్క్‌, స్వెప్సన్‌, హేజిల్‌వుడ్‌, ప్యాటిన్సన్‌, మైకేల్‌ నెసర్‌