తెలంగాణలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల.. కొత్తరకం కరోనా వైరస్’నే కారణమా ?

గత మూడ్రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్. దీనికి కారణం కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నే కారణమా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన వారిలో 20 మందికి కొత్తరకం కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. వీరి ద్వారా ఇతరులకి కొత్త రకం కరోనా వైరస్ వ్యాపించిందా ? అందుకే గత మూడ్రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే దీనికి సంబంధించిన రుజువులు మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. సో.. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు కొత్తరకం కరోనా నే కారణమని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ఇక గడిచిన 24గంటల్లో తెలంగాణలో 474 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,85,939కి చేరింది. మరోవైపు కరోనాతో తాజాగా ముగ్గురు మృతి చెందడంతో.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,538కి పెరిగింది. తాజాగా 592 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,78,523గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,878 క్రియాశీల కేసులు ఉండగా.. వీరిలో 3,735 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.