మందు బాబులకు కిక్కునిచ్చే న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

మందు బాబులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు (డిసెంబర్ 31) మందు బాబులు ఫుల్లుగా ఎంజాయ్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. రేపు మద్యం షాపులు అర్థరాత్రి 12గంటల వరకు, బార్లు, క్లబ్ లు రాత్రి 1గంటల వరకు తెరచి ఉంటాయని తెలిపింది. మరీ.. కరోనా మళ్లీ విజృంభిస్తుంది కదా. కొత్త రకం కరోనా వైరస్ కూడా తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది కదా.. ? ఇలా అర్థరాత్రి వరకు తాగి తందనాలు ఆడితే ఎలా ?? అంటే.. ప్రభుత్వానికి కావాల్సిందే ఆదాయం మాత్రమేనని మరోసారి స్పష్టం చేసింది. ఇక రేపు తాగి వాహనాలు నడిపితే మాత్రం తాట తీస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

తాగి వాహనాలు నడిపిన వారిని ఉగ్రవాదులతో పోల్చారాయన. తాగి బండి నడిపితే..వారి ఆఫీసులకు సమాచారం చేరవేస్తామని, మొదటిసారి పట్టుబడితే..రూ. 10 వేలు ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక రెండోసారి పట్టుబడితే..రూ. 15 వేలు జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మరోవైపు..హైదరాబాద్ సిటీలో పోలీసు హై కమాండ్ ఆర్డర్ ప్రకారం.. పలు ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.