‘మాస్టర్’ కొత్త పోస్టర్లు చూశారా ?


‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం ‘మాస్టర్’. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా కీలక పాత్ర పోషించాడు. విజయ్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో కూడా అదే రోజున విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా మాస్టర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే మాస్టర్ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది. ఈ సినిమా రన్ టైమ్ 178 నిమిషాలకి సెట్ చేశారు. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్లని రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ ను చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. పోస్టర్లలోనే విజయ్ లో వేరియేషన్స్ కనిపిస్తున్నాయ్. ఇక సినిమాలో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.