నందితా శ్వేతా.. గ్లామర్ తాపత్రయం !

మంచి నటి అనిపించుకొని.. స్టార్ హీరోయిన్ కాలేకపోయిన హీరోయిన్స్ లిస్టు పెద్దదే. రెజీనా, లావణ్య.. తదితరులు ఈ లిస్టులోకే వస్తారు. వీరందరు గ్లామర్ హీరోయిన్స్ గా నిరూపించుకొనేందుకు ట్రై చేస్తుంటారు. చూపించడానికి రెడీ అంటుంటారు. ఇందుకోసం హాట్ హాట్ గా ఫోటో షూట్ చేస్తారు. కనీసం అవి చూసైనా.. గ్లామర్ పాత్రలు వస్తాయన్నది వారి ఆశ. ఇప్పుడీ.. ఈ లిస్టులో హీరోయిన్ నందితా శ్వేతా చేరిపోయింది. ‘ఎక్కడికిపోతావు.. చిన్నివాడ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.. ఈ ముదుగుమ్మ.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. మంచి నటి అనిపించుకుంది. శ్రీనివాస కల్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథా చిత్రమ్2, అభినేత్రి 2, 7, కల్కీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో సుమంత సరసన కపటధారి, తమిళ్ లో శింభు సరసన ఈశ్వరన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫోకస్ కావడానికి నివేదా ప్రయత్నాలు మొదలెట్టింది. తనలో గ్లామర్ యాంగిల్ ఉంది. తనని గ్లామర్ పాత్రల కోసం వాడుకోమన్నట్టు.. హాట్ హాట్ ఫోటో షూట్ ఫోతోలని షేర్ చేసింది. ఇప్పుడీ.. పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.