‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ ‘పింక్’కి రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ చేసిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఆఖరి రోజు సెట్స్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ని హైరదాబాద్..అరకు సహా మరికొన్ని లొకేషన్స్ లో వకీల్ సాబ్ షూటింగ్ ని పూర్తి చేశారు. పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ కథను తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు మార్చేశారు.ఈ కథపై దాదాపు ఏడాదికి పైగానే కూర్చున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక న్యూ ఇయర్ కానుకగా వకీల్ సాబ్ టీజర్ రాబోతుంది. సినిమా రిలీజ్ డేటు ఎప్పుడు అన్నది టీజర్ లోనే తెలియజేసే ఛాన్స్ ఉంది.