ఆన్ లైన్’లో భార్యని అమ్మకానికి పెట్టిన ఘనుడు
అప్పుడప్పుడు విచిత్ర ప్రకటనలు చూస్తాం. ఇందులో సభ్య సమాజం ముక్కున వేలేసుకొనే ప్రకటనలు ఉంటాయ్. ఈ ప్రకటన అలాంటిది. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్ నుంచి రావడం మన ద్రౌభాగ్యం. వివరాల్లోకి వెఌతే.. ఆగష్టు 23 వ తేదీన తిరుపతికి చెందిన రేవంత్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.
వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో బెంగళూరు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నిరోజుల తరువాత భార్యను హింసించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలని చిత్రహింసలకి గురిచేశాడు. అవి భరించలేక భార్య పుట్టింటికి వెళ్ళింది. అయినా.. భార్యని వదల్లేదు. ఆమెని ఏకంగా ఆన్ లైన్ లో పెట్టేశాడు. గంటకు ఇంత అంటూ రేటు కూడా ఫిక్స్ చేశాడు. ఆ ప్రకటన చూసిన భార్య కంగుతుంది. నిలదీసేందుకు భర్త రేవంత్ ఇంటికి వెళ్లగా రేవంత్, కుటుంబ సభ్యులు ఇంటినుంచి పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు.