LRS.. మరో శుభవార్త !
తెలంగాణ ప్రభుత్వం LRS నిబంధనని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, చేసుకోని వారూ భవన నిర్మాణాల అనుమతి కోరే వెసులుబాటు కల్పించింది. అందుకు మార్గదర్శకాలను, చెల్లించాల్సిన ఫీజులను నిర్దేశిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సహా రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచిచింది. ఇందుకు సంబంధించి ఉత్వర్వులు జారీ చేసింది. ఆగస్టు 26లోగా రిజిస్ట్రేషన్ అయి, ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోనివారూ భవననిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
ఆగస్టు 26లోగా రిజిస్ట్రేషన్ అయి, ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోనివారూ భవననిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్‌కు నిర్దేశించిన ఛార్జీలతో పాటు 33 శాతం కాంపౌండింగ్ ఫీజు, 14 శాతం ఖాళీ స్థలం ఛార్జీలను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.