ఇంతలో కేసీఆర్’లో ఎంత మార్పు !
గ్రేటర్ ఎన్నికలకి ముందు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేంద్ర పథకాలని చులకన చేసి మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు వాటిని గొప్ప పథకాలుగా చెబుతున్నారు. వాటిని తెలంగాణలో అమలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్రంపై దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్.. ఆయుష్మాన్ భవ పథకాన్ని తెలంగాణలో అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ పథకం కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నోరెట్లు బెటర్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లులు, రైతు చట్టాలకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. అయితే గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ లైన్ లోకి వచ్చేశారు
ఇప్పుడాయన కేంద్రాన్ని ఫాలో అవుతున్నారు. నూతన రైతు చట్టాలు బాగున్నాయ్. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అందుకే ప్రతి గ్రామానికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేసే పనిని మానేస్తున్నం అన్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భవ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. దానికి ఆరోగ్య శ్రీతో లింకు చేయనున్నారు.
బుధవారం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ నిర్వహించిన ప్రగతి సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రధానికి సీఎస్ వివరించారు. ఇక సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్వాగతించారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.