రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్న బీజేపీ

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని బీజేపీ ఇబ్బంది పెడుతున్నట్టు, ఆయనకి పదవి రాకుండా అడ్డుగా మారినట్టు సమాచారమ్. విషయం ఏంటంటే ? తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్దిని ఖరారు చేసింది. కానీ ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే పనిలో ఉంది. అది పూర్తవ్వగానే కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరోవైపు రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం.. ఓ విషయంలో ఆలోచనలో పడిందత. అదేంటీ అంటే.. ? బీసీ సామాజికవర్గం. తెలంగాణ బీజేపీలో బీసీలకు పెద్ద పీఠ ఉంది. ముఖ్యంగా మున్నూరు కాపులకి మంచి ప్రాధాన్యత లభిస్తోంది. తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు.. ఆ పార్టీలోని కీలక నేతలంతా ఆ సామాజిక వర్గానికి చెందినవారే. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపులోనూ బీసీ కార్డ్ పని చేసింది. మున్నూరు, మురిరాజులు వన్ సైడ్ గా బీజేపీకి ఓటేశారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానంలో ఆలోచనలో పడింది. టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడమా లేక బీసీ లేదా ఎస్సీ వర్గంలో ఒక నేతను ఎంపిక చేయడమా అనేక ఆప్షన్స్‌ను కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా పరిశీలిస్తోందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంతే.. రేవంత్ రెడ్డికే పట్టకట్టడం బెటర్ అనే వాదన బలంగా ఉంది. ఆయనైతే.. సీఎం కేసీఆర్, బీజేపీపై గట్టిగా పోరాడుతారని చెప్పుకుంటున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్ట్ మిస్సయిందంటే.. దానికి భాజాపానే కారణం. ఆ పార్టీ బీసీలక్కు పెద్దపేఠ వేయడమే రేవంత్ రెడ్డి పాలిట శాపమైందని చెప్పవచ్చు.