సోలో బ్రతుకే సో బెటర్.. ఈ యేడాదిలో వచ్చే వన్నీ లాభాలే !

కరోనా లాక్‌డౌన్ తర్వాత తిరిగి థియేటర్లు తెరచుకుంటాయా ? ఒకవేళ తెరచుకున్న ప్రేక్షకులు థియేటర్స్ లోకి వస్తారా ? ఒకవేళ వచ్చిన మునుపటిలా సినిమాలు లాభాల బాట పడతాయా ? 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడపడం సాధయేనా ? సినిమాల పెట్టుబడి తిరిగి వస్తుందా ? ఇలా లక్షా తొంభై తొమ్మిది ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పింది ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా. క్రిస్మస్ కానుకగా (డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులని థియేటర్స్ కి క్యూ కట్టిస్తోంది. 

గుడ్ టాక్ మాత్రమే కాదు. మంచి వసూళ్లని రాబడుతోంది. తొలి వారంలోనే పెట్టుబడి తిరిగి వచ్చేసింది. జనవరి 1 నుంచి వచ్చేవన్నీ లాభాలే. ఈ లెక్కన సోలో బ్రతుకే సో బెటర్ కు భారీ లాభాలు దక్కనున్నాయి. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు సోలో బ్రతుకే సో బెటర్ హవా సాగనుంది. దీంతో.. కరోనా ప్రభావం మొదలవ్వక ముందే వచ్చే లాభాల కంటే ఎక్కువగానే సోలోకు లాభాలు దక్కనున్నాయి. మొత్తానికి.. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ట్రెండ్ సెట్ చేశారు. కరోనా తర్వాత కూడా ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించి ట్రెండ్ సెట్ చేశారు.