29కి చేరిన కొత్తరకం కరోనా కేసులు

పాతవి తగ్గితే.. కొత్తవి పెరుగిన్నట్టుంది పరిస్థితి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో రికవరీ రేటు 96.16 శాతానికి చేరింది. ఇక మరణాల రేటు 1.45 శాతంగా కొనసాగుతోంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం.. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది.

దాదాపు నెల రోజులుగా రోజువారీ రికవరీలు.. కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి.  బ్రిటన్‌ రకం కరోనాతో దేశంలో ఇప్పటి వరకు 29 మంది ఆస్పత్రుల్లో చేరారు.

పాతరకం కరోనా అప్ డేటు విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,177 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది. ఇక కొత్తగా 20,923 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 217 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,49,435కి చేరింది.