ఏపీలో మరో విగ్రహం ధ్వంసం

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

మరోవైపు ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ఇటీవల దేవాలయాలకు సంబంధించిన వరుస ఘటనల దృష్ట్యా ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రాష్ట్ర పోలీస్‌శాఖతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్‌, విజుబుల్‌ పోలీసింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిదని, అర్చకులు, పూజారులు ఆలయ నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాజకీయ కోణంలోనే ఈ దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ దాడుల వెనక తెదేపా హస్తం ఉందని వైసీపీ నేతలు అరోపిస్తున్నారు. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తెదేపా నేతలు సవాల్ విసురుతున్నారు. ఇక బీజేపీ మాత్రం హిందూదేవాలయాలపై దాడులపై నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఏపీ సీఎం జగన్ క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతారు… గనక ఆయన మీద మతం మచ్చ వేసేందుకు ఈ దాడులు జరుగుతున్నాయన్నది మాత్రం వాస్తవం అని ప్రజలు చెప్పుకుంటున్నారు.