‘చెక్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌.. అదిరిపోయింది !


విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లు. భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. తాజాగా  ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది.

జైలు గదిలో నితిన్‌ను చూపిస్తూ “జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు” అనే పరిచయ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. మరోపక్క న్యాయమూర్తి ఆదిత్యకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం, పోలీస్‌ అధికారి “దేశద్రోహి..అదీ నీ గుర్తింపు” అని మాట్లాడటం సరికొత్త కథలా అనిపిస్తోంది. జైల్ లో నితిన్ యాక్షన్ బిట్ సీన్ ఒకటి జత చేశారు. మొత్తంగా చెక్ ఫస్ట్‌ గ్లింప్స్‌ అదిరిపోయింది.