కొవాగ్జిన్‌’కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యం, భద్రత ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించింది.

అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత ప్రజలకి స్వదేశీ కరోనా టీకా అందుబాటులోకి వచ్చినట్టయింది. మరోవైపు కరోనా వాక్సిన్ పంపిణీ కోసం దేశ వ్యాప్తంగా వాక్సిన్ డ్రైన్ లని నిర్వహిస్తున్నారు.