వారిని ఆఫర్ల కోసం వాడుకోలేదు
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా మనసు విప్పి మాట్లాడారు. ఆఫర్ల కోసం తాను ఎవరిని వాడుకోలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎన్నో సంవత్సరాల నుంచి నేను సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. అందువల్ల నాకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎక్కువ. నాలాంటి అభిరుచులు ఉన్న తోటి నటీనటులు, పలువురు ప్రముఖులు నాకు స్నేహితులయ్యారు.
అయితే ఏదైనా సినిమాలో ఆఫర్స్ పొందడం కోసం ఈ స్నేహ బంధాలను నేను ఎప్పుడూ వాడుకోలేదు. నటిగా సరైన అవకాశాల్లేక కొన్ని సందర్భాల్లో నేను ఎంతటి తీవ్ర అసహనానికి గురయ్యానో కేవలం నా స్నేహితులకు మాత్రమే తెలుసు. అలాగే, కెరీర్‌పరంగా ‘సంజు’, ‘తప్పడ్’ చిత్రాలు నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి’ అని చెప్పుకొచ్చారు.