డేంజర్ : వెలుగులోకి నాలుగు కొత్తరకం కరోనా వైరస్’లు

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. కరోనా వైరస్ కి వాక్సీన్లు వస్తున్నాయని మురిసిపోతున్న సమయంలో.. కొత్త కొత్త కరోనా వైరస్ లు వెలుగులోకి వస్తున్నాయి. కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇప్పటికే 30 దేశాలకు పాకింది. భారత్ లోనూ కొత్తరకం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు నాలుగు కొత్తరకం వైరస్ లు వెలుగులోకి వచ్చాయని ప్రకటించింది.

గత ఏడాది జనవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చిందని తెలిపింది. ఆ తరువాత..ఈ స్ట్రెయిన్‌యే అత్యధికంగా వ్యాపించిందని చెప్పింది. జూన్ 2020 నాటికి అత్యధిక శాతం కేసులు ఈ స్ట్రెయిన్ కారణంగానే సంభవించాయట. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మూడో స్ట్రెయిన్ బయటపడింది.

డెన్మార్క్‌లో తొలిసారిగా ఉనికి లోకి వచ్చిన ఈ స్ట్రెయిన్‌కు శాస్త్రవేత్తలు క్లస్టర్-5గా నామకరణం చేశారు. మానవుల రోగ నిరోధక శక్తిని ఈ స్ట్రెయిన్ దీటుగా ఎదుర్కొగలదన్న ఆందోళనను అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. ఇక డిసెంబర్ నెలలో బ్రిటన్‌లో మరో కరోనా స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న కరోనా వైరస్ ఈ కొత్త స్ట్రెయిన్‌కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.