దేశంలో 16,504, తెలంగాణలో 238 కొత్త కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజు రోజూకి నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయ్. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,40,469కి చేరింది. గడిచిన 24 గంటల్లో 214 మంది ఈ మహమ్మారికి బలికాగా.. మొత్తం మరణాల సంఖ్య 1,49,649గా ఉంది.ఇక దేశంలో క్రియాశీల కేసులు 2.5లక్షలకు దిగువనే కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు దేశంలో 2,43,953 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 2.39శాతానికి చేరింది. ఇదిలా ఉండగా..ఇప్పటి వరకు 99,46,867 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.16 శాతంగా ఉంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 238 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 2,87,740కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1551కి చేరింది. మరోవైపు తాజాగా 518 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,81,083కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,106 క్రియాశీల కేసులు ఉండగా.. వీరిలో 2,942 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.